Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

కరెంటు బిల్లుని చూసి షాక్ అయిన తాప్సి

హీరోయిన్ తాప్సి తన ముంబై అపార్ట్మెంట్ కి వచ్చిన కరెంట్ బిల్ కి చూసి షాక్ అయ్యింది. సాధారణంగా వచ్చే బిల్లుకు పదిరెట్లు ఎక్కువ రావడంతో ఆమె షాక్ తిన్నారు. ఊహించని ఆ పరిణామాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాప్సి లాంటి హీరోయిన్ కి కూడా చుక్కలు చూపించిన ఆ కరెంట్ బిల్ ఎంత అనే కదా మీ డౌట్. తాప్సి అపార్ట్మెంట్ కి ఏకంగా ఓ నెలకి 36000 రూపాయలు బిల్ రావడం జరిగింది. దీనితో ఆమె ట్విట్టర్ లో పోస్ట్స్ పెట్టారు.
ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ ఇది మా అపార్ట్‌మెంట్‌ బిల్లు. క్లీనింగ్‌ కోసమని వారంలో ఒక రోజు ఈ ఆపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటాం. మాములు రోజుల్లో ఎవరూ ఉండరు. ఈ బిల్లు చూస్తుంటే మాకు తెలియకుండానే ఎవరో ఈ ఆపార్ట్‌మెంట్‌ను వినియోగిస్తున్నారనే భయం కలుగుతోంది. నిజాన్ని వెలికితీసేందుకు నాకు సహాయం చేయడంటూఎలక్ట్రిసిటీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేస్తూ తాప్సీ ట్వీట్‌ చేసింది. మూడు నెలల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు పెరగడానికి కారణం ఏంటి? ఏ రకమైన బిల్లును వసూలు చేస్తున్నారని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆమె ప్రశ్నించారు. కాగా తాప్సీ ట్వీట్‌పై స్పందించిన ఎలక్ట్రిసిటీ అధికారులు మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా తాము బిల్లు కొట్టామని వివరణ ఇచ్చారు.

Post a Comment

0 Comments