హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత మొదటిసారి ఆయన ఫ్యామిలీ ఓ సుదీర్ఘ సందేశం విడుదల చేశారు. సుశాంత్ మరణం వారి కుటుంబంలో ఎంతటి విషాదం నింపిందో తెలిపిన ఆ కుటుంబం.. సుశాంత్ టాలెంట్, కమిట్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్ గుర్తు చేసుకున్నారు. ఇక సుశాంత్ ని ఎంతగానో ప్రేమిస్తున్న ఫ్యాన్స్ కి వారు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఆ లేఖలో వారు కొన్ని కీలక ప్రకటనలు చేశారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరిట ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి…మూవీ, క్రీడా, విద్యా రంగాలలో ఎదగాలనుకుంటున్న యువతకు సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. సుశాంత్ చిన్నతనంలో పెరిగిన పాట్నాలోని రాజీవ్ నగర్ నందు గల ఇంటిని సుశాంత్ స్మారక చిహ్నంగా మార్చి..అందులో సుశాంత్ కి సంబంధిచిన వస్తువులను ఉంచనున్నారు.
0 Comments