పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రానున్న సర్కారు వారి పాట సినిమా అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రదానంగా ప్రస్తావించబోతున్నారని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. కాగా ఈ సినిమా పాయింట్ ఇదేనని తెలుస్తోంది.
సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశాల చుట్టూ ఈ సినిమా నడుస్తోందని.. అలాగే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్ గా నటించనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి.
0 Comments