Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

బాలయ్యకి బర్త్డే విష్ చేసిన స్టార్స్

బాలయ్యకి బర్త్డే విష్ చేసిన స్టార్స్
బాబాయ్ బాలయ్య విశిష్టమైన పుట్టినరోజు అబ్బాయ్ ఎన్టీఆర్ అరుదైన సందేశంతో విషెష్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా బాలయ్యపై తనకున్న అభిమానాన్ని,ప్రేమను తెలియజేశారు. ఎన్టీఆర్ ”నా లోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్ డే బాబాయ్ . జై బాలయ్య !” అని పోస్ట్ చేశారు. బాలయ్య పుట్టిన రోజుకు అంత ఆత్మీయ సందేశం పంపిన అబ్బాయిని నందమూరి ఫ్యాన్స్ ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. ఎన్టీఆర్,బాలయ్యలకు తిరుగు లేదంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన మిత్రుడు బాలకృష్ణకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. 60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు, ఇదే ఉత్సాహం, ఉత్తేజంతో, ఆయురారోగ్యాలతో వంద వసంతాల సంబరం కూడా జరుపుకోవాలని కాంక్షించారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవి హీరో బాలకృష్ణకు ఆత్మీయ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం, అటు పరిశ్రమ వర్గాలతో పాటు, మెగా మరియు నందమూరి అభిమానులలో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇటీవల చిత్ర పరిశ్రమకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వంతో జరిగిన కొన్ని కీలక సన్నివేశాలకు బాలయ్యను పిలవని కారణంగా… బాలయ్య చిరుతో పాటు, కొందరు చిత్ర ప్రముఖులను ఉద్దేసింది కొన్ని ఘాటు విమర్శలు చేశారు. బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో చిరు మరియు బాలయ్య మధ్య అంతరం పెరిగిందని అందరూ భావిస్తున్న తరుణంలో బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి చిరు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా, బాలకృష్ణకు చిరంజీవి మంచి ఆప్తుడన్న విషయం నేటితో అర్థం అయ్యింది. ఇక ఈ మధ్యనే సోషల్ మీడియాలోకి ఎంటరైన చిరంజీవి అనేక ముఖ్య సందర్భాలపై స్పందిస్తూ తన ప్రత్యేకత చాటుకున్నారు.

Post a Comment

0 Comments