Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

స్టార్ హీరోయిన్స్ తో కీర్తి సురేష్ పెంగ్విన్ టీజర్ విడుదల నేడే

స్టార్ హీరోయిన్స్ తో కీర్తి సురేష్ పెంగ్విన్ టీజర్ విడుదల నేడే
మహాన‌టి ఫేమ్ కీర్తి సురేష్ అప్ క‌మింగ్ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ పెంగ్విన్ ను ఎక్స్ క్లూజివ్ గా ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎమోజాన్ ప్రైమ్ వీడియో వారు జూన్ 19న విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పెంగ్విన్ టీజ‌ర్ ను జూన్ 8న విడుద‌ల చేయ‌డానికి ఎమెజాన్ టీమ్ ప్లాన్ చేసింది. ఈ టీజ‌ర్ ను తెలుగు, తమిళ్‌, మరియు మలయాళం భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయ‌బోతున్నారు.
స్టార్ హీరోయిన్లు తాప్సీ ప‌న్ను, స‌మంత‌, మంజు వారియ‌ర్, త్రిష ఈ టీజ‌ర్ ని జూన్ 8న త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలు ద్వారా విడుద‌ల చేస్తున్న‌ట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ ప‌తాకం పై ద‌ర్శ‌క నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈశ్వ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

Post a Comment

0 Comments