మహేష్ తన 27వ చిత్రం మే 31న తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సంధర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు పరుశురాంతో ఆయన తన నెక్స్ట్ మూవీ చేస్తుండగా సర్కారు వారి పాట అనే భిన్నమైన టైటిల్ ప్రకటించడం గమనార్హం. ఇక టైటిల్ మరియు మహేష్ ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా మహేష్ సొంత నిర్మాణ సంస్థ భాగస్వామిగా ఉంది.
కాగా ఈ మూవీలో విలన్ పాత్రకు చాల ప్రాధాన్యం ఉండగా ఆ పాత్ర కోసం ఓ స్టార్ హీరోని తీసుకోవాలని భావిస్తున్నారట. కన్నడ హీరో సుధీప్ ని ఈ మూవీలో విలన్ పాత్ర కోసం సంప్రదించారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. తాజాగా మహేష్ ఈ పాత్రకు మరో కన్నడ స్టార్ ఉపేంద్ర బాగుంటాడని భావిస్తున్నారట. ఆయన్ని ఈ పాత్ర కోసం తీసుకోవలసిందిగా మహేష్ దర్శకుడికి సూచించారని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఉపేంద్ర తెలుగులో విలన్ పాత్రల కోసం నన్ను ఎక్కువగా సంప్రదిస్తున్నారు అని చెప్పడం జరిగింది.
0 Comments