కొద్దిరోజులుగా సమంత తమిళంలో ఓ మూవీ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నయనతార నటిస్తుందని వార్తలు వచ్చాయి. కాగా ఈ మూవీ అధికారికమే అని తెలుస్తుంది. అలాగే ఈ మూవీ కోసం సమంత తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నారట. ఇది తక్కువ బడ్జెట్ మూవీ కావడంతో పాటు…కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలకు భారం కాకూడని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది. దర్శకుడు విగ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ ఏడాది సమంత జాను చిత్రంలో నటించారు. ఈ మూవీ విడుదలైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్స్ పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
0 Comments