గ్లామర్ పరిశ్రమలో ఫిట్ నెస్ అండ్ బ్యూటీ చాలా అవసరం. శరీర ఆకృతిపై శ్రద్ద, అందంపై ఆలోచన ఉండాలి. ముఖ్యంగా ఇది హీరోయిన్స్ కి చాలా అవసరం. అందుకే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కఠినమైన కసరత్తులు చేస్తూ…కడుపు మాడ్చుకొని..అభిరుచులు వదిలేసి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు. ఈ విషయంలో సమంత చాలా కేర్ తీసుకుంటారు. ఆమె దిన చర్యలో యోగా మరియు ఎక్సర్సైజ్ అనేవి తప్పక ఉంటాయి.
ఇక ఈ మధ్య 48 రోజుల ఈశా క్రియ కూడా చేపట్టినట్టు చెప్పారు. కాగా నేడు సమంత తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పంచుకున్నారు. ఆఫోటోలో ఆమె కఠినమైన ఓ యోగాసనం వేశారు. శరీర బరువును పూర్తిగా చేతులపై ఉంచి కాళ్ళను గాల్లో బ్యాలన్స్ చేస్తున్న ఆ యోగ పోజ్ ఆసక్తిరేపుతుంది. ఆ యోగ పోజ్ చూసిన నెటిజెన్స్ వావ్ సమంత అని మెచ్చుకోవడంతో పాటు, లైక్స్ తో విరుచుకుపడుతున్నారు.
0 Comments