టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని ఈశా క్రియ ప్రారంభించారు. యోగా ప్రక్రియలలో ఒకటైన ఈశా క్రియను ఆమె 48రోజుల పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని సమంత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆమె ఈశా క్రియలో భాగమైన ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే తన అభిమానులు కూడా ఈశా క్రియ చేయాలని, తనతో జాయిన్ కావాలని కోరుకున్నారు.
ఇక ఈ క్రియలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంత, ఆరోగ్యంతో పాటు సామర్ధ్యాన్ని పెంచి సంపూర్ణమైన జీవితం గడపడంలో ఉపయోగపడుతుందని మెస్సేజ్ పెట్టారు. మరి అందంతో పాటు ఆరోగ్యం కూడా చేకూర్చే ఈశా క్రియ చేయడం చాలా మంచి పనే. సమంత సలహా తరువాత ఆమె అభిమానులు దీని గురించి తెలుసుకొని చేపట్టడం ఖాయం.
0 Comments