గత ఆదివారం హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య చేసుకొని మరణించగా, దానికి బాధ్యులుగా కరణ్, అలియా, సల్మాన్ వంటి కొందరిని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ పై వారు విరుచుకు పడుతున్నారు. దబంగ్ మూవీ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ ఇక సల్మాన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
గత వారం రోజులుగా సల్మాన్ పై విమర్శల ప్రవాహం కొనసాగుతుంది. నెటిజెన్స్ కామెంట్స్ కి సల్మాన్ ఫ్యాన్స్ ఘాటు రిప్లైలు ఇవ్వడం మరియు సుశాంత్ సపోర్టర్స్ ని తిట్టడం చేస్తున్నారు. దీనితో సల్మాన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. సల్మాన్ ఖాన్ తన ఫ్యాన్స్ కి ఓ విజ్ఞప్తి చేశాడు. సుశాంత్ అభిమానులను ఏమి అనకండి అని ఆయన కోరుకున్నారు. ప్రేమించిన వారిని కోల్పోయిన వారి భాధ వర్ణనాతీతం, కావున వారిని వదిలేయండి అని ఆయన సందేశం ఇచ్చారు.
0 Comments