బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్రేజ్ ఏ విధంగా ఉంటుందో పెద్దగా చెప్పనక్కర్లేదు. అయితే ఎప్పుడూ సేవా భావంతో సాదాసీదాగా ఉండే సల్మాన్ తాజాగా చీపురు పట్టి కనిపించాడు.
అయితే లాక్డౌన్ కంటే ముందు తన సోదరి అర్పితా ఖాన్ కొడుకు పుట్టినరోజు వేడుకల కోసం సల్మాన్ తన మిత్ర బృందం జాక్వలైన్ ఫెర్నాండేజ్, లూలియా వాంటర్‌తో కలిసి ముంబైకి సమీపంలో ఉన్న పన్వేల్ ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. ఆ సమయంలోనే లాక్డౌన్ విధించడంతో వారంతా అక్కడే ఉన్నారు. అయితే నేడు ‘వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే’ సందర్భంగా సల్మాన్ చీపురు చేత పట్టి ఫామ్ హౌస్‌లో ఉన్న చెత్తను శుభ్రం చేశాడు. అయితే తన స్నేహితులతో కలిసి సల్మాన్ ఫామ్‌హౌజ్‌ను శుభ్రం చేయడం అభిమానులను ఆకట్టుకోవడంతో ఈ వీడీయో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
0 Comments