Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

నాని కొత్త సినిమాలో ఫిదా హీరోయిన్

నాని కొత్త సినిమాలో ఫిదా హీరోయిన్
నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా శ్యామ్ సింగ రాయ్, ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ అండ్ క్రేజీ బ్యూటీ సాయి పల్లవిని తీసుకున్నారు. నానితో జత కట్టడానికి ఆమెతో ఇప్పటికే మేకర్స్ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. నిజానికి సాయి పల్లవిని ఫిబ్రవరిలోనే మేకర్స్ సంప్రదించారు, కానీ లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయింది. దాంతో తాజాగా ఆమెను ఫైనల్ చేశారు. ఇక ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
ఇక ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది. నాని ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాబోతున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments