ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రాంచరమ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కిస్తున్న చిత్రం మన దేశంలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రంగా నిలిచింది.
అయితే ఈ కరోనా కాస్త కాలంలో అన్ని చిత్రాల షూటింగ్ నిలిచిపోయినట్టుగానే ఈ చిత్రం షూటింగ్ కూడా వాయిదా పడింది. అందుకే మళ్ళీ షూటింగ్స్ మొదలయిన తర్వాత పక్కా ప్లానింగ్ ప్రకారం షూటింగ్ చెయ్యాలని రాజమౌళి ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.
అందులో భాగంగా మొదట మిగిలి ఉన్న కీలక యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ షూటింగ్స్ ను కూడా కేవలం పరిమిత సిబ్బందితోనే తెరకెక్కించనున్నారట.
రాజమౌళి ప్రణాళికలు మొత్తం మార్చివేసింది కరోనా లాక్ డౌన్. ఆయన ఆర్ ఆర్ ఆర్ కోసం అద్భుత లొకేషన్స్ ఎంపిక చేసుకొని పెట్టుకున్నారు. ఐతే ఇప్పుడు ఆయన ఎంచుకున్న లొకేషన్స్ లో షూటింగ్ చేయడానికి వీలు లేని పరిస్థితి. కనీసం రాష్ట్రం దాటి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన భారీ సెట్స్ వేసి హైదరాబాదులోనే అత్యధిక షూటింగ్ పూర్తి చేయాలని నిశ్చయించుకున్నారు.
కాగా ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం ఓ భారీ సెట్ రాజమౌళి వేయిస్తున్నాడు. ఈ సెట్ ఖరీదు దాదాపు 20కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. భారీ సినిమా కొసవడంతో అందుకు తగ్గట్టే భారీ నిర్మాణ వ్యయంతో ఈ సెట్స్ వేస్తున్నారు. డి వి వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
0 Comments