రామ్ గోపాల్ వర్మ కొద్దిరోజుల క్రితం క్లైమాక్స్ అనే చిత్రాన్ని విడుదల చేశాడు. ఆర్ జి వి వరల్డ్ అనే ఓ ప్రత్యేకమైన యాప్ లో విడుదలైన ఆ చిత్రం భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఆ మూవీకి వర్మ ఒక సారి చూడడానికి 100 రూపాయలు వసూలు చేశాడు. ఆ సినిమాను చూడడానికి ఎగబడిన జనం సర్వర్ కూడా క్రాష్ చేశారు. 12 గంటల్లో 1.68 లక్షల మంది ఆ సినిమా చూశారు. ఆ సినిమాతో వర్మ భారీగా లాభాలు రాబట్టినట్లు తెలుస్తుంది.
ఆ స్పూర్తితో మరో అడల్ట్ కంటెంట్ మూవీకి ఆయన శ్రీకారం చుట్టాడు. నగ్నం అనే శృంగారంతో కూడిన క్రైమ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుండగా టికెట్ ధర వంద శాతం పెంచాడు.నగ్నం చిత్రానికి ఆయన 200 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఒకసారి ఆ సినిమా చూడడానికి 200 చెల్లించాలన్నమాట.
0 Comments