మొత్తానికి రామ్ గోపాల్ వర్మకి జ్ఞాపకాలు కూడా ఉంటాయని తాజాగా వర్మ ట్వీట్ తెలియజేసింది. అనగనగా ఒక రోజు సినిమాకి సంబంధించి చివరి షూటింగ్ పిక్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి తనలోని ఓ జ్ణాపకాన్ని బయటపడ్డాడు. అనగనగా ఒక రోజు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జె డి చక్రవర్తి, ఊర్మిళ ప్రధాన పాత్రధారులుగా 1996 లో వచ్చింది. ఒక ఉత్కంఠభరితమైన తెలుగు సినిమాగా ఈ సినిమాకి మంచి పేరు ఉంది.
కాగా సినిమా కథలో జె డి చక్రవర్తి, ఊర్మిళ పక్కపక్క ఇళ్ళలో ఉంటారు. ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కానీ వారి తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకు కూడా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. వీరి ప్రేమను అంగీకరించరు. వారిద్దరూ ఇంట్లోంచి పారిపోతారు. మధ్యలో వారికి ఎన్నో అవాంతరాలు వీటన్నింటినీ అధిగమించి చివరకు ఎలా బయటపడతారన్నదే మిగతా కథ.
అన్నట్టు ఈ సినిమాలో బ్రహ్మానందం మైఖేల్ జాక్సన్ అనే దొంగగా నటించాడు. పోలీసులను తప్పించుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు మంచి హాస్యాన్ని సృష్టించింది. ఈ సినిమాలో నటనకు బ్రహ్మానందంకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం కూడా లభించింది.
0 Comments