Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

అరణ్య కోసం చాల కష్టపడ్డ రానా

అరణ్య కోసం చాల కష్టపడ్డ రానా
బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడిగా రానా నటన తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఒంటి చేత్తో అడవి దున్నను మట్టి కరిపించగల బలాఢ్యుడిగా రానా భారీ శరీరంతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇచ్చారు. మరి ఆ భారీ కాయం కోసం రానా గంటల తరబడి వ్యాయామం చేయాల్సివచ్చింది.
ఐతే అంతకు మించిన కష్టం ఆయన అరణ్య చిత్రం కోసం పడ్డారట. అరణ్య మూవీలో కొన్ని సన్నివేశాలలో రానా ఏనుగు తొండం భుజాన వేసుకొని నడవాల్సి వచ్చిందట. దాదాపు 160-170 కేజీల బరువు ఉండే ఏనుగు తొండం మోయడం చాలా ఇబ్బందిగా అనిపించేదట. ఇక ఆ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం బాగా కష్టపడ్డాడట రానా. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూ లో ఆయన స్వయంగా తెలియజేశారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ హిందీ మరియు తమిళ బాషలలో కూడా విడుదల కానుంది.

Post a Comment

0 Comments