Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మల్టీస్టారర్ లో రానా మరియు వెంకటేష్

మల్టీస్టారర్ లో రానా మరియు వెంకటేష్
మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ మూవీ తెలుగు రీమేక్ పై కొద్దిరోజులుగా పెద్ద చర్చే నడుస్తుంది. ఈమల్టీ స్టారర్ లో నటించే హీరోలు వీరే నంటూ అనేక పేర్లు వినిపించాయి. ఐతే ఈ మూవీ చేయనున్నారు అంటూ ప్రధానంగా బాలకృష్ణ మరియు రానా పేర్లు వినిపించాయి. రానా ఈ ప్రాజెక్ట్ పై సుముఖత వ్యక్తం చేశాడని తెలియగా, బాలయ్య విషయంలో క్లారిటీ రాలేదు. ఐతే బాలయ్య పుట్టిన రోజు నాడు ఈ సినిమాలో నేను నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీనితో బాలయ్య ఆఫర్ వెంకటేష్ దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తుంది.
ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ మరియు హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై తీయడానికి ప్రయత్నాలు చేస్తుండగా, ఈ మూవీలోని హవాల్దారు పాత్రను పోషించిన పృథ్వీరాజ్ పాత్ర కోసం హీరో రానా ని ఓకే చేసి ఇక మరో కీలక పాత్ర అయిన బిజూ మీనన్ పాత్రకోసం బాలకృష్ణను తీసుకోవాలని ఇప్పటి వరకు ప్రయత్నాలు చేసారు. ఐతే ఆయన చేయను అని చెప్పడంతో ఆ పాత్ర కోసం వెంకటేష్ ను తీసుకున్నారట. రీమేక్స్ కి ముందుండే వెంకటేష్ కూడా ఒకే చెప్పినట్లు సమాచారం.

Post a Comment

0 Comments