నేడు మూవీ మొఘల్ మరియు దాదాసాహెబ్ అవార్డు గ్రహీత రామనాయడు 85వ జయంతి. ఈ సంధర్భంగా ప్రముఖులు ఆయన సేవలను కొనియాడారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆయనతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా చిరు తన ట్వీట్ లో “రాజా …!” అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవి చూసాను. కారంచేడు నుంచి ఓ కుర్రాడు, దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించటమే కాదు…నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ గర్వకారణం.సినిమా అంటే మీకున్న ప్రేమ,మీరు చేసిన సేవలు ఈ తరానికి చిరస్మరణీయం” అని అన్నారు.
ఎక్కడో మారు మూల గ్రామం నుండి సినిమా నిర్మాణంపై మక్కువతో మద్రాసు వెళ్లి, సినిమా నిర్మాతగా మారారు రామానాయుడు గారు. ఆయన ఖ్యాతిని చిరంజీవి ఈ విధంగా గుర్తు చేసుకున్నారు. ఇక రామానాయుడు చిరంజీవిని రాజా అని పిలిచేవారట.
0 Comments