ఇప్పుడు మన టాలీవుడ్ లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్రెండింగ్ టాపిక్ గా నిలిచారు. జానర్ చూడకుండా అన్నిటిని చేస్తూ వెళ్లిపోయిన ఆర్జీవీ ని ఇప్పుడు కరోనా కూడా ఆపలేకపోయింది. అందుకు నిదర్శనమే తాను తెరకెక్కించిన “క్లైమాక్స్” చిత్రం.
పార్న్ స్టార్ మియా మల్కోవాతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆర్జీవీ వరల్డ్ అనే వెబ్ సైట్ మరియు యాప్ లో పెట్టి ఒక్కో వ్యూ కి 100 రూపాయలు చొప్పున అని పెట్టారు. అయినప్పటికీ లక్షన్నర మందికి పైగా డబ్బులు పెట్టి మరీ చూశారని వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
అంతే కాకుండా ఈ చిత్రం ఒక గేమ్ ఛేంజింగ్ గా మారింది అని తన ట్విట్టర్ లో తెలిపారు. ఈ కరోనా బ్రేక్ లో మంచి ఆప్షన్ అని అతనే తెలుపుతున్నాడు. దీనితో ఈ కరోనా సమయంలో ఆర్జీవీ అసలైన విజయాన్ని అందుకున్నాడని నెటిజన్స్ అంటున్నారు. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ మరియు శ్రేయాస్ మీడియా వారు సంయుక్తంగా విడుదల చేసారు.
0 Comments