ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏ టైమ్ లో మొదలుపెట్టారో కానీ అన్నీ అవాంతరాలే. మొదటి నుండి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సవ్యంగా సాగడం లేదు. ఇప్పటికే ఓ సారి విడుదల తేదీ వెనక్కి జరిపిన చిత్ర బృందం జనవరి 2021కి మార్చారు. జనవరిలో కూడా ఈ సినిమా రావడం అసంభవమే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం జరపలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇక తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కి అనుమతి ఇచ్చినా పూర్తి స్థాయిలో షూటింగ్ నిర్వహించే అవకాశం లేదు.
వివిధ పరిశ్రమల చెందిన నటులు ఈ చిత్రంలో భాగమై ఉండగా వారిని సమీకరించడం పెద్ద సమస్యగా మారింది. ఎన్టీఆర్, చరణ్ మాత్రమే ఆయనకు అందుబాటులో ఉన్నారు. ముంబై లో ఉన్న అలియా భట్, అజయ్ దేవ్ గణ్ కూడా పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక విదేశీ నటులు ఇండియా రావడం జరగని పని. ఈ నేపథ్యంలో ముందు ఎవరి పార్ట్ పూర్తి చేయాలి, అందుబాటులో ఉన్న నటులతో ఏ సన్నివేశాలు తెరకెక్కించాలనేది పెద్ద సమస్యగా మారిందట.
0 Comments