దర్శకుడు పూరి జగన్నాధ్…చాలా కాలంగా జనగణమన తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అప్పట్లో మహేష్ హీరోగా ఆ మూవీ దాదాపు ఖాయం అయ్యిందని వార్తలు రావడం జరిగింది. కారణాలేమైనా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తాజాగా ఈ చిత్రం తెరకెక్కించడానికి రంగం సిద్ధం అవుతుందని ఆయన పెద్ద చర్చకు తెరదీశారు. అలాగే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.
కాగా పేట్రియాటిక్ సబ్జెక్టు తో తెరకెక్కనున్న ఈ మూవీ బ్యాక్ డ్రాప్ పై ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ఈ మూవీని పూరి ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నాడట. ఈ మూవీలో హీరో ఆర్మీ జవానుగా కనిపిస్తాడని సదరు వార్తల సారాంశం.
0 Comments