Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రభాస్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రభాస్
ప్రభాస్ నిన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ఆయన తెలంగాణా రాజ్య సభ సభ్యుడు జె. సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటడంజరిగింది . ఇక ప్రభాస్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి హీరో రామ్ చరణ్, రానా దగ్గుబాటి మరియు సాహో హీరోయిన్ శ్రద్దా కపూర్ ని నామినేట్ చేశారు. లాక్ డౌన్ తరువాతబయట పెద్దగా కనిపించని ప్రభాస్ ఈ ఛాలెంజ్ పుణ్యమా అని ఫ్యాన్స్ కి దర్శనమిచ్చారు. ట్రెండీ వేర్ లో ఆయన లుక్ సూపర్ గా ఉంది. ప్రభాస్ కొంచెం ఒళ్ళు చేశారు అని కూడాఅనిపిస్తుంది . ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వివారాలు అవుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే షూటింగ్స్ కి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కొద్దిరోజులలో ప్రభాస్ షూటింగ్ లో పాల్గొననున్నారు. దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Post a Comment

0 Comments