Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ప్రభాస్ బర్త్డే రోజే ఫస్ట్ లుక్

ప్రభాస్ బర్త్డే రోజే ఫస్ట్ లుక్
సోషల్ మేడియా వేదికగా ఫ్యాన్స్ ఎంత గగ్గోలు పెట్టినా ప్రభాస్ మూవీ అప్డేట్ అయితే రావడం లేదు. దీనిపై విసుగుపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ వార్ కి తెరదించినట్లున్నారు. ఎటూ ఇన్నాళ్ళు ఆగారు…మరో నాలుగు నెలలు ఆగి ప్రభాస్ పుట్టినరోజున అన్ని కలిపి గ్రాండ్ గా జరుపుకుంటే బెటర్ అనిపిస్తుంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే నేపథ్యంలో ఆ రోజు గ్రాండ్ గా మూవీ టీజర్ అండ్ టైటిల్ రావచ్చు. ఆలస్యం అయినా అప్పటివరకు వెయిట్ చేయించి ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇస్తారేమో అనిపిస్తుంది.
ఈ మూవీ దాదాపు 50 శాతం వరకు షూటింగ్ జరుపుకున్నట్లు తెలుస్తుంది. అలాగే దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తుండగా…యూరఫ్ నేపథ్యంలో నడుస్తుందట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ మూవీ విడుదల కానుంది.

Post a Comment

0 Comments