Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్న సీన్ ఆర్ఆర్ఆర్ లో కూడా ఉందా

పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్న సీన్ ఆర్ఆర్ఆర్ లో కూడా ఉందా
ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ ఎపిక్ వండర్స్ లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “RRR” కూడా ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ చిత్రంలో తారక్ కొమరం భీంలా కనిపించనున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఇప్పుడొక టాక్ వినిపిస్తుంది. ఈ రోల్ లో తారక్ పై ఒక అదిరిపోయే ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందట.
అయితే ఇలాంటి తరహా సన్నివేశమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ ల దర్శకత్వంలో రానున్న మరో భారీ పీరియాడిక్ చిత్రంలో కూడా ఉండనుంది అని అప్పుడు టాక్ వినిపించింది. అందులోను ఇది కూడా ఒక భారీ యాక్షన్ సన్నివేశమే. మరి ఈ రెండు చిత్రాల్లో ఈ కీలకంగా మారిన సీన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Post a Comment

0 Comments