Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఆ సాంగ్స్ లేకపోవడం పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశే

ఆ సాంగ్స్ లేకపోవడం పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశే
మొదటిసారి కెరీర్ లో పవన్ ఓ పీరియాడిక్ మూవీలో నటిస్తున్నారు. ఆయన క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ మొఘలుల కాలం నాటి పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో పవన్ రాబిన్ హుడ్ తరహా…బంధిపోటు పాత్ర చేస్తున్నాడని సమాచారం. ఐతే ఈ చిత్రం నుండి నిరాశపరిచే అంశం ఒకటి బయటికి వచ్చింది. అదేమిటంటే ఈ మూవీలో కేవలం రెండు సాంగ్స్ మాత్రమే ఉంటాయట, అవి కూడా కథలో భాగమై నేపథ్యంలో వచ్చే సాంగ్స్ అని తెలుస్తుంది.
పవన్ చిత్రాలాలంటే జోష్ నిచ్చే డ్యూయట్స్ మరియు మాస్ సాంగ్స్ కి ఫేమస్ కాగా, ఆ తరహా సాంగ్స్ లేకపోవడం నిరాశపరిచే అంశమే. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జాక్విలిన్ పెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కొంత చిత్రీకరణ జరుపుకుంది.

Post a Comment

0 Comments