చాలా రోజులు కొత్త సినిమా ప్రకటన చేయనకుండా ఊరించిన మహేష్, లేటైనా ఫ్యాన్స్ ని అలరించాడు. దర్శకుడు పరుశురామ్ తో ఆయన ప్రకటించిన సర్కారు వారి పాట టైటిల్ మరియు ఫస్ట్ లుక్ కి మంచి స్పందన దక్కింది. మహేష్ ని దర్శకుడు పరుశురాం సరికొత్తగా పరిచయం చేస్తాడు అనే భరోసా వారిలో కలిగింది. కాగా ఈ చిత్రంలో విలన్ గా కన్నడ స్టార్ హీరో సుధీప్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథలో కీలకమైన విలన్ పాత్రకు సుధీప్ అయితే బెటర్ ఛాయిస్ అని వారు భావిస్తున్నారట.
ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ గా ఎవరు చేస్తారు అన్నది కాస్త హాట్ టాపిక్ అవుతుంది. మొదట తన హిట్ పెయిర్ కియారా అద్వానీ పేరు వినిపించింది. తర్వాత ఓ కొత్త నటి ఉంటుందని కూడా వినిపించింది. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తుంది.
0 Comments