భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ అమలు లో ఉంది. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా తమ ప్రాంతాలకు వెళ్ళవలసిన వలస కార్మికులు, కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారి బాధలు చూసి చలించిన నటుడు సోనూ సూద్ తనకు తోచిన సహాయాన్ని చేస్తున్నాడు.ఇప్పటికీ కూలీలను తరలించేందుకు ప్రత్యేక బస్సుల ద్వారా తరలించి తన మంచి మనసును చాటుకున్నాడు.ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలని భావించి, బాధపడుతున్న వలస కార్మికులు కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు కూడా చేశారు.
ఎవరైనా సహాయం కావాలి అని కాల్ చేస్తే వెంటనే స్పందిస్తున్నారు. అంతేకాక సోషల్ మీడియా ద్వారా కూడా తనకు తోచిన విధంగా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా మరొకసారి తన మంచి మనసును చాటుకున్నాడు.వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేకంగా మూడు రైళ్ల ను బుక్ చేశాడు.బీహార్ నుండి ముంబై లో పని కోసం వచ్చిన వారి కోసం ఈ రైళ్ళను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అయితే బస్సుల ద్వారా సహాయం చేయడం తో సోను సూద్ కి ఎక్కువగా కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. అయితే ప్రతి ఒక్కరికీ సహాయం చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అయితే ఎక్కువ మందిని రైళ్లలో పంపే అవకాశం ఎక్కువగా ఉండటం వలన ఈ పని చేసినట్లు తెలిపారు సోనూ సూద్.అయితే ఈ మహోన్నత కార్యక్రమం లో తనకు సహాయం చేస్తున్న సినీ పరిశ్రమ కు, ఇతర స్నేహితులను తాను కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments