గత ఏడాది హీరో కార్తీ ఖైదీ చిత్రంతో బంపర్ హిట్ అందుకున్నాడు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆ చిత్రాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సెంటిమెంట్ యాక్షన్ కలగలిపి దర్శకుడు లోకేష్ కానగరాజ్ అద్భుతంగా తెరకెక్కించాడు. తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైన ఈ చిత్రం దీపావళి కానుకగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
కాగా ఈ కాంబినేషన్ మళ్ళి రిపీట్ కానుందట. ప్రస్తుతం హీరో విజయ్ తో మాస్టర్ మూవీ చేస్తున్న లోకేష్ కానగరాజ్ తన తదుపరి చిత్రం కార్తీతో చేయనున్నాడట. గతంలో లోకేష్ సూపర్ స్టార్ రజిని కాంత్ తో చేస్తాడని వార్తలు రాగా అందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. మాస్టర్ మూవీ అనంతరం స్క్రిప్ట్ పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ లోకేష్ సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన ఉందట.
0 Comments