భారతీయుల పై చైనా చేసిన దాడికి 20 మంది జవాన్ లను పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. భారతీయులు అందరూ చైనా పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైనా వస్తువులను, అప్లికేషన్ లను బ్యాన్ చేయాల్సిందిగా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కొన్ని కోట్ల మంది ప్రజల ఆగ్రహం కారణంగా కేంద్ర ప్రభుత్వం చైనా దేశానికి సంబంధించిన 59 అప్లికేషన్ లను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే దేశ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే టిక్ టాక్ అప్లికేషన్ ను బ్యాన్ చేయకూడదు అంటూ కొందరు తమ గళాన్ని వినిపిస్తున్నారు. అయితే అందులో హీరో నిఖిల్ సిద్ధార్థ్ సైతం ఉన్నారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా నిఖిల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వారు మనల్ని గౌరవిస్తున్నంత కాలం మనం టిక్ టాక్ ను బ్యాన్ చేయకూడదు అని వ్యాఖ్యానించారు. అయితే కొందరు టిక్ టాక్ బ్యాన్ చేయడం పట్ల అసహన వ్యక్తం చేస్తున్న సంగతి కొందరు నెటిజన్లు తెలిపారు.
అయితే టిక్ టాక్ కారణంగా దేశం లో చాలా మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. అయినప్పటికీ చైనా చేసిన ఆ దాడికి కేంద్ర తీసుకున్న నిర్ణయం ను ప్రజలు గౌరవిస్తారు. కొందరు మాత్రం నిఖిల్ చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీస్తున్నారు.
0 Comments