టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్ ‘ చైతు – సాయిపల్లవి’లతో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ ఓవర్సీస్ హక్కులు భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం సినిమా కాంబినేషన్. సాయి పల్లవి చైతూతో నటించడం ఇదే ప్రథమం. అందుకే వీరి జోడీ పై అంచనాలు పెరిగాయి. అందుకే ప్రముఖ ఛానెల్ అమెజాన్ ప్రైమ్ శాటిలైట్ రైట్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట.
ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా ఈ సినిమా జూలై లాస్ట్ వీక్ నుండి షూటింగ్ రెడీ కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేస్తారట. ఇప్పటికే కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా తరువాత ఆడియన్స్ ముందుకు రానుంది.
0 Comments