శేఖర్ కమ్ముల ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తర్వాత మళ్ళీ ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. నాగచైతన్య హీరోగా.. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా జూలై లాస్ట్ వీక్ నుండి షూటింగ్ రెడీ కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేస్తారట.
కాగా డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది. పైగా శేఖర్ కమ్ముల ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ అయింది. ఇప్పటికే కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా తరువాత ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
0 Comments