Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

స్క్రిప్ట్ పూర్తిచేసిన నాగ్ అశ్విన్

స్క్రిప్ట్ పూర్తిచేసిన నాగ్ అశ్విన్
ప్రభాస్ తన తర్వాతి సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. అయితే నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ ను పూర్తి చేసాడట. ఇప్పటికే షాట్ డివిజన్ కూడా ప్రారంభించాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అందుకే నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నారు.
కాగా పాన్ -ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మలచడానికి నాగ్ అశ్విన్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన గత సినిమా ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్. ప్రభాస్ చిత్రాన్నికూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు.

Post a Comment

0 Comments