Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

నితిన్ సినిమాలో ఇస్మార్ట్ హీరోయిన్

నితిన్ సినిమాలో ఇస్మార్ట్ హీరోయిన్
ప్రస్తుతం టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో “రంగ్ దే” అనే ఓ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇది లైన్ లో ఉండగానే బాలీవుడ్ హిట్ సినిమా “అంధధూన్” అనే సినిమాకు రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి శిల్పా శెట్టి ఒక కీలక పాత్రలో నటిస్తారని బజ్ వినిపించింది. ఇప్పుడు ఈ సినిమాలో ఫిమేల్ మెయిన్ లీడ్ కు మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యూత్ కు బాగా కనెక్ట్ అయిన నభా నటేష్ పేరు వినిపిస్తుంది. ఈ చిత్రానికి నభా కూడా ఒకే చెప్పినట్టు వినికిడి. ఈ లాక్ డౌన్ అనంతరం వీరు ఫ్రీ అయ్యాక ప్రాజెక్ట్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో పట్టాలెక్కనుంది.

Post a Comment

0 Comments