Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

Jr ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇప్పట్లో కష్టమే

Jr ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇప్పట్లో కష్టమే
ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆయన ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల అవుతుందని వారు భావించగా లాక్ డౌన్ కారణంగా వీడియో విడుదల చేయలేకపోతున్నాము అని చెప్పారు. రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని చూసి ఆనందిద్దాం అని ఆశపడిన ఫ్యాన్స్ ఒక్కసారిగా డీలా పడ్డారు.
ఐతే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పునఃప్రారంభం అయిన వెంటనే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ఉంటుందని సమాచారం ఉంది. దీనితో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సిద్ధం అవుతుండగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. ఐతే పరిమిత సిబ్బందితో ఆంక్షల మధ్య ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ ప్రాజెక్ట్ షూటింగ్ నిర్వహించడం కష్టం అని రాజమౌళి భావిస్తున్నారట. షూటింగ్ కోసం సెట్ సిద్ధంగా ఉన్నా, ఆయన మొదలుపెట్టడానికి ఎందుకో సంశయిస్తున్నారు. రాజమౌళి ఇంకొద్దిరోజుల తరువాత షూటింగ్ మొదలుపెడదామనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తుండగా, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో మరింత లేటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Post a Comment

0 Comments