Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

సర్కారు వారి పాటలో ప్రిన్స్ రోల్ ఇదే

సర్కారు వారి పాటలో ప్రిన్స్ రోల్ ఇదే
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రంలోని కథ మరియు మహేష్ పాత్రకు సంబంధించిన ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందనే వార్త బాగా వినిపిస్తోంది.
కాగా తాజాగా సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఆ డబ్బును తిరిగి రాబట్టడానికి మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశం మీదే ఈ సినిమా కథ సాగుతుందట.
ఇక ‘సర్కారు వారి పాట’ సినిమాలో మెయిన్ థీమ్ గురించి మహేష్ ఇటీవలే స్పందిస్తూ.. ‘ఈ సినిమా స్ట్రాంగ్ మెసేజ్ తో సాగే ఫుల్ ఎంటర్ టైనర్. నిజంగా ఈ సినిమా పై నేను చాల ఆసక్తిగా ఉన్నాను’ అని తెలిపారు. ఈ మాటలను బట్టి పై కథాంశం నిజమేనేమో అనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ సినిమాను నిర్మిస్తున్నాయి.

Post a Comment

0 Comments