Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మహేష్ బాబు బడ్జెట్ విషయం లో సీరియస్

మహేష్ బాబు బడ్జెట్ విషయం లో సీరియస్
కరోనా వైరస్ ఒక్కసారిగా ప్రపంచానికి కొత్త పరిస్థితిని చూపించింది. రేపు ఏమిజరుగుతుందో తెలియని భయం, భవిష్యత్ పై అభద్రతా భావం పెరిగిపోయేలా చేసింది . ఇక గతంలో వలే ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూస్తారనే గ్యారంటీ లేదు. కాబట్టి స్టార్ హీరోల సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తాయని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కాగా మహేష్ ఓ నిర్ణయం తీసుకున్నారట.
ఆయన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారట. నిర్మాతలకు మరియు దర్శకులకు ఇప్పటికే మహేష్ దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. వీలైనంత తక్కువ బడ్జెట్ లో మూవీ పూర్తి చేయడం సేఫ్ అని ఆయన సూచించారట. ఒక వేళ థియేటర్స్ విడుదల లేకున్నా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కించిన నేపథ్యంలో ఓ టి టి ద్వారా కూడా మంచి లాభాలు ఆర్జించ వచ్చు అనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది.

Post a Comment

0 Comments