యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై ఫ్యాన్స్ లో అమితాసక్తి నెలకొని ఉంది. 2009లో ఆయన టీడీపీ తరుపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన మళ్ళీ రాజకీయాల వైపు వెళ్ళలేదు. ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్య మాత్రం కొన్నాళ్ళుగా యాక్టీవ్ పాలిటిక్స్ లో ఉన్నారు. ఆయన రెండు సార్లు ఎమ్ ఎల్ ఏ గా గెలిచారు. కాగా బాలయ్యను ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి అడుగగా తన స్పందన తెలియజేశారు.
సినిమాలు చేస్తున్నా, పాలిటిక్స్ లో కూడా పాల్గొనవచ్చు అన్నారు. ఇప్పుడు నేను గతంలో నాన్న ఎన్టీఆర్ కూడా పాలిటిక్స్ లో ఉంటూ సినిమాలు చేశారు. నాలాగా, వాళ్ళ తాతలాగా ఎన్టీఆర్ ఓ వైపు సినిమాలలో నటిస్తూనే రాజకీయాలు కూడా చేయవచ్చు అన్నారు. అలాగే అది పూర్తిగా ఎన్టీఆర్ నిర్ణయం అని చెప్పుకొచ్చారు. యుక్త వయసులో ఉన్న ఎన్టీఆర్ కి మంచి భవిష్యత్ ఉందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.
0 Comments