కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ సైతం కుదేలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమీప కాలంలో చిత్ర పరిశ్రమ మునుపటి స్థితికి రావడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. కాబట్టి చిరంజీవి తన అనుభవంతో ప్రొడ్యూసర్స్ కి విలువైన సందేశాలు ఇస్తున్నాడట. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే ఆలోచన మానుకోవాలనేది, ఆయన మొదటి సలహా అట. ముందుగా మెగా కంపౌంట్ నిర్మాతలైన అల్లు అరవింద్, రామ్ చరణ్ లకు కూడా ఆయన ఇదే సలహా ఇచ్చారట.
ఇది వరకే భారీ బడ్జెట్ చిత్రాలకు అడ్వాన్స్ లు ఇచ్చి ఉంటే వెనక్కి తీసుకోవడం మంచిదని కూడా ఆయన చెప్పారట. ఇక రామ్ చరణ్ నిర్మాతగా ఆయన నటిస్తున్న ఆచార్య మూవీ బడ్జెట్ కూడా తగ్గించే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో మునుపటిలా గుంపులుగా థియేటర్స్ కి జనాలు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి ఉండకపోవచ్చని ఆయన ఆలోచన అని తెలుస్తుంది. ఇదే జరిగే పక్షంలో గతంలో మాదిరి వందల కోట్ల వసూళ్లు సాధ్యం కాకపోవచ్చు. అందుకే చిరు ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం.
0 Comments