Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఆచార్య చిత్రం లో కూడా చిరు కి ఎలివేషన్స్ ఉన్నాయి

ఆచార్య చిత్రం లో కూడా చిరు కి ఎలివేషన్స్ ఉన్నాయి
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అన్ని పుష్కలంగా ఉంటాయి. అటు క్లాస్ ప్రేక్షకులను, మాస్ ప్రేక్షకులను అలరించడం లో చిరు తర్వాతే ఎవరైనా. అయితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య లో చిరు దేవాదాయ శాఖ లో ఉద్యోగి గా పని చేసే పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం లో చిరు ఎలివేషన్స్ ఈ చిత్రానికి కీలకం కానున్నాయి. మొదటి చిత్రం నుండి కొరటాల శివ కొన్ని మాస్, క్లాస్ కాంబినేషన్ లలో వచ్చే సీన్లకు దియేటర్ లలో విజిల్స్ మోత మోగించింది.
అయితే ఆచార్య చిత్రం లో కూడా చిరు కి ఎలివేషన్స్ ఉండనున్నాయి. ఈ చిత్రానికి అవి చాలా హైలెట్ కానున్నాయి అని తెలుస్తోంది. మిర్చి చిత్రం నుండి ఒక లాండ్ మార్క్ ఫైట్ ను తెరకెక్కించే అలవాటు కూడా వుంది. శ్రీమంతుు, జనతా గ్యారేజి, భరత్ అనే నేను చిత్రాలలో కొరటాల మార్క్ ఫైట్ సీన్స్ మరియు ఎలివేషన్ సీన్స్ కేక పుట్టిస్తాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా కి కొరటాల శివ ఏ తరహాలో చిత్రీకరించ నున్నారు అనేది ఇపుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయింది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే అన్ లాక్ మొదలవ్వడం తో మళ్లీ చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం లో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Post a Comment

0 Comments