Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

పెంగ్విన్ తెలుగు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్

పెంగ్విన్ తెలుగు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్
లాక్ డౌన్ మూలాన పలు చిత్రాలు నేరుగా డిజిటల్ గా విడుదలకు పూనుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఇప్పుడు రాబోతున్న మరో చిత్రం “పెంగ్విన్”. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మొత్తం మూడు భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో ఈ జూన్ 19 నుంచి వరల్డ్ ప్రీమియర్ గా స్ట్రీమ్ కానుంది.
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుచి ఇటీవలే వచ్చిన టీజర్ మరియు ట్రైలర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొత్తం మూడు భాషల్లో ఈ సినిమా ట్రైలర్స్ నిన్న విడుదల కాగా వాటిలో తెలుగు ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ రాబట్టింది. దీనితో కేవలం 24 గంటల్లో 8.4 మిలియన్ వ్యూస్ ను సంపాదించింది.
ఇది తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్స్ లో టాప్ 3 స్థానంలో నిలిచినట్టు తెలుస్తుంది. మొదటి రెండు స్థానాల్లో బాహుబలి మరియు సాహో ట్రైలర్స్ ఉండగా తర్వాత స్థానంలో కీర్తి సురేష్ ట్రైలర్ నిలిచింది. ఇక్కడే షాకింగ్ విషయం ఏమిటంటే అసలు ఈ సినిమాను తెరకెక్కించిన తమిళ్ లో ఈ స్థాయి వ్యూస్ రాకపోవడం గమనార్హం. ఇది మాత్రం ఊహించని ఫీట్ అని చెప్పాలి.

Post a Comment

0 Comments