Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

పెంగ్విన్ టీజర్ తో ఆకట్టుకున్న కీర్తి సురేష్

పెంగ్విన్ టీజర్ తో ఆకట్టుకున్న కీర్తి సురేష్
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన ‘పెంగ్విన్’ చిత్రం నుండి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. సప్సెన్స్ థ్రిల్లర్ లా సాగిన ఈ టీజర్ లో కీర్తి సురేష్ నటనతో పాటు విజువల్స్, చివరి షాట్ లో చార్లీ చాప్లిన్ గెటప్ లో రివీల్ అయిన షాట్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక కీర్తి సురేష్ కూడా కొత్తగా కనిపించింది.
కాగా ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా జూన్ 19న విడుద‌ల కాబోతుంది పెంగ్విన్. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ జూన్ 11న విడుదల కానుంది.

Post a Comment

0 Comments