Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా రివ్యూ

కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా రివ్యూ
రేటింగ్: 3/5
నటులు: కీర్తీ సురేష్, మాస్టర్ అద్వైత్, లింగా, రఘు
రచన దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
నిర్మాత : కార్తీక్ సుబ్బ‌రాజు
సంగీతం : సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫి: కార్తీక్ పళని
ఎడిటింగ్: అనిల్ క్రిష్
రిలీజ్: 2020-06-19
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
మహానటి తర్వాత కీర్తీ సురేష్ కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. అప్పటి వరకు గ్లామర్ తారగానే ముద్రవేసుకొన్న కీర్తీ సురేష్ ఆ చిత్రం తర్వాత ఫెర్మార్మర్‌గా, నటిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు మంచి గుర్తింపే తెచ్చాయి. ఈ క్రమంలో కీర్తీ సురేష్ చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్లు మూతపడటంతో పెంగ్విన్ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ రోజు ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకొన్నది, కీర్తీ సురేష్ నటన ఎలా ఉందనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా కథ, కథనాలను, సాంకేతిక నిపుణుల పనితీరును పరిశీలించాలిద్దాం.
పెంగ్విన్ సినిమా కథ:
ఏడు నెలలు గర్భవతి అయిన రిథమ్ (కీర్తి సురేష్) ఎంతో కష్టపడి మిస్ అయిపోయిన తన కొడుకు (అజయ్)ను వెతికి పట్టుకునే క్రమంలో పడిన మానసిక సంఘర్షణ, ఆ వెతుకులాటలో ఆమె ఎదురుకునే ఆవేదన మరియు బాధతో సాగే ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమా. అయితే అసలు రిథమ్ కొడుకునే ఎందుకు కిడ్నాప్ చేశారు ? ఆ చేసిన వ్యక్తి చార్లీ చాప్లిన్ గెటప్ లో ఎందుకు ఉన్నారు ? ఈ మధ్యలో కొడుకు మిస్ అవ్వడంతో రిథమ్ మొదటి భర్తతో విడిపోవాల్సి రావడం, రెండో భర్త ద్వారా మళ్ళీ ఆమె తల్లి కాబోతుండటం ? చివరికీ రెండో బిడ్డ కూడా ప్రమాదంలో పడటం ? ఈ నాటకీయ పరిణామాల్లోనే ఆమె కిడ్నాపర్ ఎవరు అని తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది ? ఈ మొత్తం క్రమంలో ఆమె తన ఇద్దరి బిడ్డలను ఎలా కాపాడుకున్నది అన్నదే మిగత కథ.
ట్విస్టులు:
ఇంతకు అజయ్‌ను ఎవరు కిడ్నాప్ చేశారు? అజయ్‌ను ఎందుకు ఎత్తుకెళ్లారు? అజయ్‌ను ఎత్తుకెళ్లడం ద్వారా రిథమ్‌ను మానసికంగా ఎందుకు వేధించాలనుకొన్నారు? రిథమ్‌పై చాప్లిన్ మాస్క్ ధరించిన వ్యక్తి ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు. చాప్లిన్ మాస్క్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? డాక్టర్ డేవిడ్ ఎందుకు కిడ్నాప్ చేస్తుంటాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే పెంగ్విన్ కథ.
మొదటి భాగం:
అజయ్‌ను చాప్లిన్ వెంటాడే సీన్‌తో కథ మొదలవుతుంది. ఓ మరణం సంభవించిన ఇంట్లో అజయ్ తప్పిపోవడం లాంటి సీన్‌తో రిథమ్ తన కొడుకుపై ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని ఎమోషనల్‌గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అజయ్ గురించి అన్వేషణతో కథ సాగుతుంది. తొలి భాగంలో అజయ్ అన్వేషణ, గర్బవతిగా కీర్తీ సురేష్ అనుభవించే వేదనతో సరిపుచ్చారు. అలా సాదాసీదా కథ సాగుతుంది. కడుపులో ఉండే బిడ్డ, అలాగే తన ప్రాణాలు లెక్క చేయకుండా అజయ్ కోసం రిథమ్ పోరాటం ఆసక్తిగా మారడంతో కథపై ప్రేక్షకుడికి కొంత పట్టు దొరికినట్టు కనిపిస్తుంది. కాకపోతే కథ, కథనాల్లో చాలా లోపాలు ఉండటం సినిమా సగటుగానే సాగినట్టు ప్రేక్షకుడికి ఓ ఫీలింగ్ కలుగుతుంది.
రెండవ భాగం:
సెకండాప్ అనాలిసిస్ ఇక రెండో భాగంలో కేవలం రిథమ్ (కీర్తీ సురేష్) పాత్రపై ప్రధానంగా దృష్టి సారించడం, ఆమె భర్త పాత్ర, మిగితా వారిని ఆటలో అరటిపండులాగా వాడుకోవడం కథలో ప్రధాన లోపంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. చివర్లో విలన్ ఎవరనే పాయింట్‌ను రివీల్ చేసిన విధానం థ్రిల్లింగ్‌గా అనిపించదు. ఫ్లాష్ బ్యాక్‌కు సంబంధించిన కథలో భావోద్వేగం లోపించడం సినిమా ప్రధాన లోపంగా మారిందని చెప్పవచ్చు.
దర్శకత్వం:
దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ప్రతిభ గురించి చెప్పుకోవాలంటే స్టోరి బేసిక్ పాయింట్ బాగానే ఉన్నప్పటికీ, దానిని బలమైన కథగా మార్చడంలో డైరెక్టర్‌గా మొదటి తడబాటు కనిపిస్తుంది. కేవలం కీర్తి సురేష్ రోల్‌పైనే దృష్టి పెట్టి.. ఆ పాత్రకు బలంగా మారడానికి అవకాశం ఉన్న పాత్రలను గాలికి వదిలేయడం అతడి ఆలోచనలో లోపంగా మారిందని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లే కూడా అంత ఎఫెక్ట్‌గా కనిపించకపోవడం సినిమాకు మరో ప్రధానమైన సమస్య. దర్శకుడిగా ఈశ్వర్ బలం ఏమిటంటే.. పెంగ్విన్ చిత్రం ద్వారా మరోసారి కీర్తీ సురేష్‌లోని ప్రతిభను ప్రేక్షకులకు చూపించడమే.
కీర్తి సురేష్ నటన:
పెంగ్విన్ సినిమాకు కర్త, కర్మ, క్రియ కీర్తి సురేష్ అని మాత్రమే చెప్పుకోవచ్చు. కీర్తీ సురేష్ విషయానికి వస్తే రిథమ్‌గా నటనతో అదరగొట్టింది. ఎమోషనల్ సీన్లలో ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. పెంగ్విన్‌కు వెన్నెముకగా కీర్తి సురేష్ నిలిచిందనే విషయాన్ని చెప్పడానికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పవచ్చు. కీర్తీ సురేష్ ఫెర్ఫార్మెన్స్ చాటున మరో రోల్ దారిదాపులో కూడా కనిపించదు. ఈ సినిమాలో భావనగా నిత్య కిరుబా పాత్ర కీలకం. ఆ పాత్రను కీర్తీ సురేష్‌కు పోటాపోటీగా మార్చడంలో విఫలమయ్యారు. కొంతలో కొంత అజయ్ పాత్ర మినహాయిస్తే మిగితా పాత్రలన్నీ నాసిరకంగానే కనిపిస్తాయి.
సాంకేతిక విభాగం:
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమా క్వాలిటీ పరంగా చూసుకుంటే బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ.. సినిమా విజువల్ గా పూర్తిగా ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం పర్వాలేదు. అయితే సీన్ మూడ్ తో పాటు ఓవరాల్ సినిమాని దృష్టిలో పెట్టుకుని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎడిటర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్లాష్ బ్యాక్ కి లైవ్ కి మధ్య స్మూత్ కట్టింగ్ తో సినిమాని చక్కగా ఎడిట్ చేశారు. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్ రివ్యూ:
ఓవరాల్‌గా పెంగ్విన్ సినిమా గురించి చెప్పాలంటే.. కీర్తి సురేష్ నటన తప్ప మరోటి పెద్దగా చెప్పుకొనే అంశాలే కనిపించవు. భావోద్వేగాలు ఏ మాత్రం పండని చిత్రమని చెప్పవచ్చు. థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన బలమైన ఫ్లాష్ లేకపోవడం మైనస్. అలాగే విలన్ పాత్రను గొప్పగా ఎస్టాబ్లిష్ చేసి.. ఆ పాత్రను రివీల్ చేసిన తర్వాత ఆ రేంజ్‌ ఇంపాక్ట్ కలిగించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాంతో సినిమా నాసిరకంగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులకు తెలియని నటీనటులు ఉండటం మరో లోపంగా మారింది. కాకపోతే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ బ్యానర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

Post a Comment

0 Comments