Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

త్రివిక్రమ్ సినిమాలో ఎన్నారైగా Jr ఎన్టీఆర్

త్రివిక్రమ్ సినిమాలో ఎన్నారైగా Jr ఎన్టీఆర్
ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎన్నారైగా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో పుట్టి పెరిగాక ఇండియాకి ఎపుడూ రాని తారక్, మొదటిసారి ఇండియాకి రావాల్సి వస్తోందట. సినిమాలో భిన్నమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంటుందట.
అయితే ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రతో పాటు త్రివిక్రమ్ మరో కీలక పాత్రను కూడా రాస్తున్నాడట. ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ, ఫిల్మ్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం 2021 దసరాకి విడుదల కానుంది.

Post a Comment

0 Comments