Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

అద్భుతంగా Jr ఎన్టీఆర్ - ఒలీవియా లవ్ సీన్స్

అద్భుతంగా Jr ఎన్టీఆర్ - ఒలీవియా లవ్ సీన్స్
విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ – ఓలివియా లవ్ ట్రాక్ కు సంబంధించిన సీన్స్ ను ఇప్పటికే షూట్ చేశారు, అయితే ఈ లాక్ డౌన్ గ్యాప్ లో ఎడిటర్ తమ్మిరాజు ఈ సీన్స్ ఎడిటింగ్ కూడా పూర్తి చేశారట . ఎన్టీఆర్ – ఒలివియా లవ్ ట్రాక్ లో ఎక్కడా టాకీ పార్ట్ ఉండదని.. కేవలం వారి మధ్య చోటు చేసుకున్న సంఘటనలతోనే ఓలివియా, ఎన్టీఆర్ పై ఘాడమైన ప్రేమను పెంచుకుంటుందని.. చివరికీ ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం ప్రాణాలు ఇస్తుందని.. ఎన్టీఆర్ – ఓలివియా ట్రాక్ మొత్తం రాజమౌళి చాల కొత్తగా ఎమోషనల్ గా ప్లాన్ చేశాడని తెలుస్తోంది.
అలాగే ఈ సినిమాలో తెలంగాణ యాసలో తారక్ పలికే డైలాగ్ లు కూడా అద్భుతంగా ఉంటాయని.. ఈ సినిమాలో ప్రధాన హైలెట్స్ లో ఎన్టీఆర్ డైలాగ్ లే మెయిన్ హైలెట్ అవుతాయట. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజుకు మిస్ అయిన తారక్ ఫస్ట్ లుక్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ? ఆ వీడియోలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు ? ఇలా ఎన్టీఆర్ పై వీడియో రిలీజ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Post a Comment

0 Comments