దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న చిత్రాలలో కెజిఎఫ్2 ఒకటి. 2018 లో విడుదలై సంచల విజయం సాధించిన కెజిఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ మూవీ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు హీరో యష్ అభిమానులతో పంచుకున్నారు. ప్రచారం అవుతున్నట్లు ఈ మూవీ ఓ టి టి లో విడుదల చేసే అవకాశమే లేదన్నారు. మొదటి పార్ట్ విజయం తరువాత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా బిగ్ స్క్రీన్ లోనే విడుదల అవుతుంది అన్నారు.
అలాగే దాదాపు ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినదట. కేవలం 20రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలివుంది అని ఆయన తెలియజేశారు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని అక్టోబర్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ ప్రతినాయకుడిగా చేస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కీలక రోల్ చేస్తున్నారు. మొదటి భాగంలో నటించిన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సీక్వెల్ లో కూడా నటిస్తుంది.
0 Comments