Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

నితిన్ సినిమాలో చేయనంటున్న ఇలియానా

నితిన్ సినిమాలో చేయనంటున్న ఇలియానా
భీష్మ సినిమాతో మంచి సాలిడ్ కం బ్యాక్ హిట్ అందుకున్న నితిన్ చేతిలో ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మూడు కూడాను మంచి హైప్ ఉన్నవే. అయితే వీటిలో బాలీవుడ్ సూపర్ హిట్ అయిన అంధధూన్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ పనులు జరుగుతున్నాయి.
అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో గోవా బ్యూటీ ఇలియానా కూడా నటిస్తుంది అని కొన్ని వార్తలు వినిపించాయి. ఇప్పటికే టాలీవుడ్ కు దూరం అయిన ఆమె ఆ చిత్రంలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు అందుకు కారణం ఏమిటి అన్నది తెలుస్తుంది. ఈ సినిమా కథ ప్రకారం ఒక ఫిమేల్ రోల్ కు కీలక పాత్ర ఉంది.
కాకపోతే అది కాస్త వయసు మళ్ళిన పాత్ర. ఇపుడు ఈ రోల్ కు గాను సీనియర్ నటి టబు ఫిక్స్ కాగా అంతకు ముందు చిత్ర యూనిట్ ఈ రోల్ కోసం ఇలియానాను అప్రోచ్ అయ్యారట, కానీ అప్పుడు అలాంటి రోల్ లో కనిపించడం తనకు ఇష్టం లేదని చెప్పిందట అందుకే ఇలియానా ఈ సినిమా నుంచి తప్పుకుందని వినికిడి.

Post a Comment

0 Comments