Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ప్రభాస్ సినిమా కోసం భారీ హాస్పిటల్ సెట్

ప్రభాస్ సినిమా కోసం భారీ హాస్పిటల్ సెట్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ 20వ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో 5 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన హాస్పిటల్ సెట్‌ ను మేకర్స్ నిర్మిస్తున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
నాలుగు అంతస్తులలో హాస్పిటల్ సెట్ ను ఓ స్టూడియోలో నిర్మిస్తున్నారు. ఇందులో ఐసియు వార్డ్, ప్రత్యేక వార్డ్, జనరల్ వార్డులు మరియు డాక్టర్ రూమ్స్ ఉన్నాయట. ఈ గ్రాండ్ సెట్‌లో నెల రోజులకు పైగా షూటింగ్‌ చేయనున్నారని.. ఆగస్టు నుండి షూట్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
రాధాకృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకి ‘రాధే శ్యామ్’ అని టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నారట.ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ కూడా రెండు గెటప్స్ లో కనిపిస్తారట. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Post a Comment

0 Comments