భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న గుణశేఖర్ కొన్నాళ్లుగా తన టీమ్ తో కలిసి ఓ భారీ పౌరాణిక చిత్రంపై పనిచేస్తున్నారు. 2015లో రుద్రమదేవి చిత్రం తెరకెక్కించిన గుణశేఖర్, దాదాపు మూడేళ్ళుగా హిరణ్యకశిప ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడు.
విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు తండ్రి అయిన రాక్షసరాజు హిరణ్య కశిపుడు విష్ణుమూర్తి ద్వేషి. ఇతని సంహారం కోసం మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తాడు. ఆ రాక్షసరాజు నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా హిరణ్యకశిప పాత్ర రానా చేయనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు దర్శకుడు గుణశేఖర్ పూర్తి చేశారు.
లాక్ డౌన్ మరియు కరోనా వైరస్ మరియు రానా పెళ్లి వంటి విషయాల కారణంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయినా సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి కొంచెం సమయం పట్టేలా కనిపిస్తుంది. దానికి తోడు రానా ఇప్పటికే కొన్ని సినిమాలు ఒప్పుకొని ఉన్నారు. ఇక రానా మిహికాల వివిహాహం ఆగస్టు 8న జరగనుంది.
0 Comments