దర్శకుడు గుణశేఖర్ నుండి మూవీ వచ్చి ఐదేళ్లు అవుతుంది. 2015లో ఆయన రుద్రమదేవి మూవీ చేశారు. అప్పటి నుండి ఆయన ఒకే చిత్రంపై పనిచేస్తున్నారు. హిరణ్యకశ్యప అనే ఓ భారీ పౌరాణిక చిత్రం చేయడం కోసం ఆయన ఏర్పాట్లలో ఉన్నారు. దాదాపు 3 ఏళ్లుగా ఆయన తన టీంతో కలిసి పూర్తి స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే నిర్మాతలు రూ. 15 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం ఉంది.
కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ ముందుకు వచ్చింది. ఈ బడా నిర్మాణ సంస్థ హిరణ్యకశ్యప మూవీలో నిర్మాణ భాగస్వామిగా ఉండనుంది. ఫాక్స్ స్టార్ నిర్మిస్తున్న మొదటి సౌత్ ఇండియన్ మూవీ హిరణ్యకశ్యప కావడం విశేషం. ఇక ఈ మూవీకి ఆర్ట్ డైరెక్టర్, డీఓపీ మరియు యాక్షన్ కొరియో గ్రాఫర్స్ ని హాలీవుడ్ నుండి తీసుకోనున్నారట. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఈ చిత్రం ఏ స్థాయిలో తెరకెక్కనుందో చూడాలి.
0 Comments