రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ చాప్టర్- 1తో సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల వసూళ్లు సాధించింది ఆ చిత్రం. దాంతో యశ్ నేషనల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక యశ్ లో మంచి కామెడీ సెన్స్ కూడా ఉంది. తాజాగా తన భార్య పై చక్కని సెటైర్ ఒకటి వేశాడు. కర్ణాటక ప్రభుత్వం కొత్త లాక్ డౌన్ నియమాలను ఎందుకు ఏర్పాటు చేసిందో నాకు తెలియదు, కానీ లాక్ డౌన్ నియమాలకు నా భార్యకు మధ్య ఏదైనా సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రతిరోజూ రాత్రి 8 గంటల లోపే ఇంటికి తిరిగి రావాలట. పైగా ఆదివారం నాడు పూర్తి లాక్ డౌన్ అట. ఏది ఏమైనా ఈ భార్యమణి స్నేహపూర్వక నియమాలు మనకు భద్రతను భరోసాను ఇస్తాయి. మనం సేఫ్ గా ఉండడానికి సహాయపడతాయి. అందరూ జాగ్రత్తగా ఉండడి అని యశ్ పోస్ట్ చేశారు.
0 Comments